విజయనగరం: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర ఆటగాడు శశికాంత్ (5/54) రెండో రోజు బౌలింగ్‌లో విజృంభించాడు. దీంతో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం 236/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 95.1 ఓవర్లలో 261 పరుగులకే ఆలౌటైంది.
కెపె్టన్ రికీభుయ్ (94; 10 ఫోర్లు, 1 సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు 4 పరుగులే జతచేసి... సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కరణ్ షిండే (45), రికీ భుయ్ అవుటయ్యాక ఆంధ్ర ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతో సేపు పట్టలేదు. రెండో రోజు 25 పరుగులే చేసిన ఆంధ్ర 6 వికెట్లను కోల్పోయింది. యశ్ దయాళ్, అంకిత్ చెరో 3 వికెట్లు తీశారు.
అయితే ఆ తర్వాత యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. ఆర్యన్ జుయల్ (60) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర ఆట నిలిచే సమయానికి 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ప్రశాంత్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉండగా, మహీప్ (14) అవుటయ్యాడు. ప్రస్తుతం ఆంధ్ర 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment