
రాజస్తాన్ బౌలర్ అనికేత్ చౌదరి
తిరువనంతపురం: రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర క్రికెట్ జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. రాజస్తాన్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్ లో 53.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.
చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 100/4తో ఆట కొనసాగించిన ఆంధ్ర మరో 109 పరుగులు జతచేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (39; 6 ఫోర్లు), తపస్వి (44; 6 ఫోర్లు, 1 సిక్స్), సందీప్ (43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. రాజస్తాన్ బౌలర్లలో శుభమ్ శర్మ(4/32), అనికేత్ చౌదరి(3/50) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా... ఈనెల 27 నుంచి జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో ఆంధ్ర తలపడుతుంది.