
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర జట్టుతో శుక్రవారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది.
అనుస్తుప్ మజుందార్ (125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... ఓపెనర్ సౌరవ్ పాల్ (96; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనుస్తుప్, సౌరవ్ మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం కెప్టెన్ మనోజ్ తివారీ (15 బ్యాటింగ్), భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్ రెండు వికెట్లు తీయగా... నితీశ్ కుమార్ రెడ్డి, షోయబ్ ఖాన్‌లకు ఒక్కో వికెట్ లభించింది.
చదవండి: భారత మహిళల విజయగర్జన