Majumdar
-
ఆంధ్రతో మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన బెంగాల్ ఓపెనర్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర జట్టుతో శుక్రవారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది. అనుస్తుప్ మజుందార్ (125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... ఓపెనర్ సౌరవ్ పాల్ (96; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనుస్తుప్, సౌరవ్ మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం కెప్టెన్ మనోజ్ తివారీ (15 బ్యాటింగ్), భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్ రెండు వికెట్లు తీయగా... నితీశ్ కుమార్ రెడ్డి, షోయబ్ ఖాన్లకు ఒక్కో వికెట్ లభించింది. చదవండి: భారత మహిళల విజయగర్జన -
తడి ఆరని వర్ణాలు
ఎనభై ఏళ్ల క్రితం బెంగాల్‌లోని విక్టోరియన్ కాలపు నిర్జీవ చిత్ర సంప్రదాయాన్ని బ్రేక్ చేసి, చిత్రకళకు కొత్తపుంతలు అద్దిన ఓ చిత్రకారుడి వర్ణ ఖండాలను సింగపూర్లోనిఓ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించడం అంటే.. ఆయనకే కాదు, భారతీయ కళా నైపుణ్యానికే అదొక పురస్కారం. హేమేంద్రనాథ్ మజుందార్ (1898–1948) బెంగాలీ చిత్రకారుడు. తాను మంచి మంచి బొమ్మలు వేయాలనుకుంటే తండ్రి మాత్రం అందుకు వ్యతిరేకించాడు. ఆయనను ఎదిరించి కలకత్తా ఆర్ట్ స్కూల్లో చేరిపోయారు. అక్కడ నుంచి జూబిలీ అకాడమీకి వెళ్లి మరింత నేర్చుకున్నారు. ఇంగ్లండు నుంచి చిత్రకళకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు తెప్పించుకున్నారు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో వెలితి అనిపించేది. మనుషుల బొమ్మలను సహజంగా ఉండేలా చిత్రీకరించాలనే కోరిక బలంగా నాటుకుంది ఆయనలో. 1920లో అతుల్ బోస్ అనే సాటి కళాకారుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ కలకత్తా గవర్నమెంట్ ఆర్ట్ స్కూల్లో కలిశారు. చూసిన ప్రతి బొమ్మను, దృశ్యాన్ని... అన్నిటినీ కుంచెలో ముంచి చూపారు. బెంగాల్లో ప్రసిద్ధంగా ఉన్న విక్టోరియన్ ‘నిర్జీవ లేఖనాన్ని’ కూడా చిత్రీకరించారు. ఆ విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో ఒక సొంత స్కూల్‌ని పెట్టారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అనే ఒక పత్రికనూ స్థాపించారు. దీని ద్వారా చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావించారు. విస్తృతమైన అంశాలను ఇందులో పాఠ్యాంశాలుగా పెట్టారు. కళలకు సంబంధించిన వార్తలు, గాసిప్స్, ట్రావెలాగ్, చిన్న కథలు, హాస్యం అన్నీ పరిచయం చేశారు. మజుందార్ వేసిన మొట్టమొదటి మేజర్ పెయింటింగ్.. పల్లి ప్రాణ్ (పల్లె ప్రాణం). ఆ వరుసలోనే వెట్ శారీ ఎఫెక్ట్.. అంటూ కొన్నిటిని చిత్రీకరించి, పబ్లిష్ చేశారు. ఆర్థిక కారణాల వల్ల వారి స్కూల్ కొన్నిరోజులకే మూత పడింది, ఆ తరువాత సొసైటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని రెండో వెంచర్ ప్రారంభించారు. ఇంగ్లండ్‌లో కొంతకాలం ఉండి వచ్చారు. మజుందార్ మహిళల మీద వరుసగా రకరకాల అంశాలను చిత్రీకరించారు. మహిళల టాయిలెట్స్, పగటి కల కనడం.. ఇలాంటివి కూడా ఉండేవి. మరో చిత్రంలో అమ్మాయి వెనుకకు తిరిగి ఉన్న రూపాన్ని చూపారు. ఇందులో ఆమె యువతిగా ఉన్నప్పుడు ఆమె శరీరం ఎలా ఉన్నది, ఆమె కండరాలు, ఆమె ఎముకల నిర్మాణం కూడా చూపారు. ద వూండెడ్ వానిటీ, బ్లూ సారీ, హార్మొనీ, ఇమేజ్ అని ఆయన వేసిన పెయింటింగ్స్‌లో చాలావరకు అమ్మాయిలను దిగంబరంగానే చూపారు. వాటర్ కలర్స్ ఉపయోగించారు వాటికి. బోంబే ఆర్ట్ సొసైటీలో మజుందార్‌కి మూడు సంవత్సరాలు వరుసగా మూడు బహుమతులు వచ్చాయి. స్మృతి అనే పెయింటింగ్‌కి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇలా మూడుసార్లు ఆయనకే రావడాన్ని కొందరు విమర్శకులు తప్పుపట్టారు. 1940లలో మజుందార్ అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు గడించారు. జైపూర్, బికనీర్, కోటా, కశ్మీర్, మయూర్భంజ్, పటియాలా మహారాజులు తమ దగ్గర పనిచేయమని కోరుకున్నారు. పటియాలా మహారాజు భూపేంద్రనాథ్ సింగ్ ఆయనను తన ఆస్థాన చిత్రకారుడిగా ఐదు సంవత్సరాల పాటు నియమించుకున్నారు కూడా. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ’æలో ఉన్న సాంటియో గ్యాలరీలో ఈ నెల 17 వరకు వారం పాటు ఆయన చిత్రాలను ప్రదర్శించారు. – జయంతి -
తేల్చుకోవాల్సింది మీరే..!
కోల్‌కత : వచ్చే ఎన్నికల్లో కారల్ మార్క్స్, మమతా బెనర్జీ, నరేంద్ర మోదీల్లో ఎవరి సిద్దాంతాలు కావాలో బెంగాల్ ప్రజలు తేల్చుకోవాలని పశ్చిమబెంగాల్ బీజేపీ వైస్-ప్రెసిడెంట్ జయప్రకాశ్ మజుందార్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్ ఈస్ట్ -2018 చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ విఫలమైందనిపై ఆయన విమర్శలు గుప్పించారు. మమత పాలనలో మత ఘర్షణలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. మమతా..మోదీ సిద్ధాంతాలు..! ‘మార్క్స్ సిద్ధాతంతం ప్రకారం మతం అనేది ప్రజలకు మత్తులాంటిది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకారం మతం అనేది ఓటు బ్యాంకు మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకారం మతం అనేది సమజానికి వెన్నుముక, మతం అనేది ఒక పవిత్రమైన విధానం’అని ముజుందార్ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం సీపీఎం కథ ముగిసిందని అన్నారు. బెంగాల్ భవిష్యత్తు బీజేపీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. మీరు ప్రభుత్వం నడపడం లేదా..! బెంగాల్లో అశాంతికి, మత ఘర్షణలకు మతతత్వ బీజేపీ కారణమని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్గా ఛటర్జీ ఆరోపించారు. రాష్ట్రేతర శక్తుల మూలంగానే బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తృణమూల్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నారు. ఛటర్జీ వ్యాఖ్యలను మజుందార్ ఖండించారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్న టీఎంసీ బెంగాల్లో అధికారం లేదా అని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలన సాగిస్తున్న మమత బెనర్జీ ప్రభుత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని అన్నారు. కాగా, ఇటీవల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
ముందస్తు నిర్బంధం
ఐకేపీ యానిమేటర్ల అరెస్టు సమస్యల పరిష్కారం కోరుతూ ఐకేపీ యానిమేటర్లు సోమవారం చేయతలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 120 మందికిపైగా యానిమేటర్లు, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేశారు. ఒంగోలు సెంట్రల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చేపట్టిన చలో హైదరాబాద్‌కు ఆదివారం జిల్లానుంచి వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి యానిమేటర్లతో పాటు మద్దతుగా వెళ్తున్న సీఐటీయూ నేతలనూ అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 120 మందికిపైగా అరెస్టు చేసి నిర్బంధించారు. వంద రోజులుగా ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అయితే, జిల్లా నుంచి చలో హైదరాబాద్‌కు వెళ్తున్న వారిని రాష్ర్ట ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావును వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. మరో నాయకుడు చీకటి శ్రీనివాసరావును టూటౌన్లో ఉంచారు. అరెస్టులకు నిరసనగా నేడు ర్యాలీలు... చలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను అడ్డుకుని అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్ తెలిపారు. యానిమేటర్లంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు అరెస్టు, విడుదల... బేస్తవారిపేట : ఐకేపీ యానిమేటర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు డీ జరీనాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు.. జరీనా లేకపోవడంతో చిల్లర దుకాణంలో ఉన్న ఆమె భర్త ఫకీరయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కనీసం దుకాణం మూసేందుకు కూడా సమయం ఇవ్వకుండా లాక్కుని వచ్చారు. సమాచారం అందుకున్న జరీనా.. సీఐటీయూ నాయకులతో పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన భర్త అరెస్టుపై ప్రశ్నించారు. తాను చలో హైదరాబాద్‌కు వెళ్లడం లేదని, ఆరోగ్యం బాగలేకపోవడంతో కంభం వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నానని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆమె భర్త ఫకీరయ్యను విడుదల చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో జరీనా, సీఐటీయూ నాయకులు మాట్లాడిన తర్వాత విడుదల చేశారు. అరెస్టు అప్రజాస్వామికం ఒంగోలు టౌన్ : ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్‌కు సన్నద్ధమవుతున్న సీఐ టీయూ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, నాయకుడు టీ మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి జీ శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ గంగయ్య, డీఎంకే రఫీ, ఎన్.నాగేశ్వరరావులను పోలీసులు వారి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అంతేగాకుండా సీఐటీయూ కార్యాలయంలో ముఠా కార్మికుల యూనియన్ సమావేశంలో ఉన్న నాయకులను కూడా అరెస్టు చేశారన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం విడనాడకుంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.