సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్‌కు నగరం వేదిక కానుంది. పీఎం పాలెంలో గల ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నుంచి ఈ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
కాగా అక్టోబరు 26- 29 వరకు ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇన్నింగ్స్ సాగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సెషన్‌లో సెషన్‌లో ఆంధ్ర, మధ్యాహ్నం సెషన్‌లో హిమాచల్‌ప్రదేశ్ జట్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేశాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు నిర్వాహకులు క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త
రేపటి నుంచి ఆరంభం కానున్న రంజీ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. స్టేడియం వద్ద 15వ నంబర్ గేట్ నుంచి ఉచిత ప్రవేశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆంధ్ర జట్టు తొలుత విదర్భ చేతిలో 74 పరుగులు, రెండో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది.
ఆంధ్రా జట్టు కెప్టెన్‌గా రషీద్
ఆంధ్రా జట్టు కెప్టెన్ రికీబుయ్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా అనధికార నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికవడంతో అందుబాటులో లేరు. ఆంధ్రా జట్టుకు షేక్ రషీద్ నాయకత్వం వహించనుండగా అభిషేక్ రెడ్డి, హానుమ విహారి ఓపెనింగ్ చేయనుండగా అశ్విన్ హెబ్బర్ మిడిలార్డర్‌లోను, శ్రీకర్ భరత్ కీపింగ్ చేస్తారు. మహీప్‌కుమార్, వంశీకృష్ణ బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్టీఫెన్, సత్యనారాయణ, శశికాంత్, స్పిన్ బౌలింగ్ విభాగంలో లలిత్, విజయ్ బంతి, మనీష్ మెరుపులు మెరిపించనున్నారు. రఫీ, కరణ్ షిండే సైతం జట్టుకు ఎంపికయ్యారు.
చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment