సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో గోవా తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ గ్రూపు-సిలో భాగంగా రాంఛీ వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గోవా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
గోవా బ్యాటర్లలో కెప్టెన్ దర్శన్ మిసల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దర్శన్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు రాహుల్ త్రిపాఠి(47), తునీష్ సాకర్(11 బంతుల్లో 34) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మోహన్, హనుమా విహారి చెరో వికెట్ పడగొట్టారు.
పోరాడి ఓడిన ఆంధ్ర..
ఇక 232 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 18.3 ఓవర్లలో 201 పరుగులకు ఆంధ్ర ఆలౌటైంది. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఆంధ్ర జట్టు ఓటమి పాలైంది. ఆంధ్ర బ్యాటర్లలో హనుమ విహారి(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ శ్రీకర్ భరత్(31), అశ్విన్ హెబ్బర్(31) పరుగులు చేశారు. గోవా బౌలర్లలో అర్జున్ టెండూల్కర్, లక్షయ్ గార్గ్ తలా మూడు వికెట్లు సాధించగా.. తారి, దర్శన్ మిసల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: AUS vs SL: డేవిడ్ వార్నర్ మంచి మనసు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment