టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే దేశవాళీ సీజన్‌లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. విహారితో పాటు ఢిల్లీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ కుల్వంత్ ఖేజ్రోలియా కూడా వచ్చే డోమాస్టిక్ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరపున ఆడనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో వెల్లడించింది.
ఇప్పటికే వీరిద్దరూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తో వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదే విధంగా సోమవారం (జూన్ 26) జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
కాగా హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ 2022 రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు ఇదే తొలి రంజీ ట్రోఫీ టైటిల్. ఇక 29 ఏళ్ల విహారి జూన్ 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విహారి చివరగా టీమిండియా తరపున గతేడాది జూలైలో ఇంగ్లండ్‌పై ఆడాడు. ఇప్పటివరకు 16 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విహారి 839 పరుగులు సాధించాడు.
చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా!
Comments
Please login to add a commentAdd a comment