ఇండోర్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మధ్యప్రదేశ్‌కు 62 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆంధ్ర బ్యాటర్లలో కరణ్ షిండే (38), కెప్టెన్ రికీ భుయ్ (32) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు.
ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో 3 వికెట్లు తీయగా...అవేశ్ ఖాన్, కుల్వంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 83 పరుగులకు పెంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో
మధ్యప్రదేశ్ 234 పరుగులకు ఆలౌటైంది.
893 రంజీ ట్రోఫీలో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ చేసిన పరుగులు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల జాబితాలో అతను అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఒకే సీజన్‌లో ఆంధ్ర తరఫున అత్యధిక పరుగులు (868) చేసిన అమోల్ మజుందార్ (2012–13) రికార్డును భుయ్ సవరించాడు.
Comments
Please login to add a commentAdd a comment