
దిబ్రూగఢ్: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో ఆంధ్ర జట్టు తొలి విజయాన్ని అందుకుంది. అస్సాం జట్టుతో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మూడో మ్యాచ్‌లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు 172 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన అస్సాం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది.
చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 81/5తో ఆట కొనసాగించిన అస్సాం మరో 101 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లు లలిత్ మోహన్ (4/81), గిరినాథ్ రెడ్డి (3/57), గొలమరు మనీశ్ (3/19) అస్సాం జట్టును కట్టడి చేశారు. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న ఆంధ్ర జట్టు రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఈనెల 26 నుంచి జరిగే నాలుగో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో ఆంధ్ర ఆడుతుంది.
చదవండి: తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం