అజింక్య రహానే (ఫైల్ ఫొటో)
Aim is to play 100 Test matches: టీమిండియా తరఫున 85 అంతర్జాతీయ టెస్టులు.. 12 సెంచరీలు.. ఇందులో ఒకటి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో.. మరొకటి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సాధించినది.. ఇక అర్ధ శతకాలు 26.. మొత్తంగా 5077 పరుగులు..
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టుకు సారథి.. 13 ఏళ్ల కెరీర్‌లో ముంబై బ్యాటర్ అజింక్య రహానే సాధించిన ఘనతలు. అయితే, ప్రస్తుతం జాతీయ జట్టులో 35 ఏళ్ల వెటరన్ బ్యాటర్‌కు అవకాశాలు కరువయ్యాయి.
విఫలమై.. జట్టుకు దూరమై
యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీలో ఈ టెస్టు స్పెషలిస్టు వెనుబడిపోయాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్- 2021-23 తర్వాత వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు ఆఖరిసారిగా ఆడిన రహానే.. వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
కానీ ఆ టూర్‌లో వైఫల్యం కారణంగా మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనున్న జట్టు ఎంపిక సందర్భంగానూ సెలక్టర్లు అతడికి మొండిచేయే చూపారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసిపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశ్ చోప్రా వంటి భారత మాజీ క్రికెటర్లు సైతం ఇదే మాట అంటున్నారు.
రీఎంట్రీ ఇస్తా..
అయితే, రహానే మాత్రం తాను కచ్చితంగా టీమిండియా తరఫున పునరాగమనం చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. 100 టెస్టులు ఆడటమే తన ఆశయం అంటున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2024లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా జట్టుతో చేరాడు.
100 టెస్టులు ఆడటమే లక్ష్యం
డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో సారథిగా రహానేకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర జట్టుపై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ముంబై తరఫున మెరుగైన స్కోర్లు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాను.
ఈసారి ఎలాగైనా రంజీ ట్రోఫీ గెలవాలనే సంకల్పంతో ఉన్నాం. అలాగే నా ముందున్న మరో అతిపెద్ద లక్ష్యం.. టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తిచేసుకోవడమే’’ అని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు.
చదవండి: Shreyas Iyer: బాధ లేదు.. నాకు అప్పగించిన పని పూర్తి చేశా.. ఇక
Comments
Please login to add a commentAdd a comment