Ranji Trophy 2022: ఆధిక్యం కోల్పోయిన ఆంధ్ర  | Ranji Trophy 2022 Andhra Vs Raj: Rajasthan Takes Control Day 2 | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022 Andhra Vs Raj: ఆధిక్యం కోల్పోయిన ఆంధ్ర 

Published Sat, Feb 19 2022 8:25 AM | Last Updated on Sat, Feb 19 2022 8:27 AM

Ranji Trophy 2022 Andhra Vs Raj: Rajasthan Takes Control Day 2 - Sakshi

ఆంధ్ర బౌలర్‌ చీపురపల్లి స్టీఫెన్‌

Ranji Trophy 2022 Andhra Vs Raj- తిరువనంతపురం: రాజస్తాన్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఇ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86.2 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 75/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర 149 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది.

ఓపెనర్‌ గిరినాథ్‌ (71; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో శశికాంత్‌ (26 బంతుల్లో 34; 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. 51 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన రాజస్తాన్‌ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి ఓవరాల్‌గా తమ ఆధిక్యాన్ని 148 పరుగులకు పెంచుకుంది.

ఇక తొలి రోజు ఆటలో భాగంగా ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ చీపురపల్లి స్టీఫెన్‌ (5/51) ఐదు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement