
డిబ్రూఘర్: రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర మొదటి విజయం దిశగా సాగుతోంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం ఓటమికి చేరువైంది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అస్సాం మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెపె్టన్ రియాన్ పరాగ్ (48 నాటౌట్) పోరాడుతుండగా...చేతిలో ఉన్న ఐదు వికెట్లతో అస్సాం మరో 282 పరుగులు చేయాల్సి ఉంది.
ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి 3, లలిత్ మోహన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 147/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రికీ భుయ్ (187 బంతుల్లో 125; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం పూర్తి చేసుకోగా, హనుమ విహారి (63) అర్ధసెంచరీ సాధించాడు. షేక్ రషీద్ (40 నాటౌట్) కూడా రాణించగా... అస్సాం బౌలర్లలో సిద్ధార్థ్ వాసుదేవ్ 5 వికెట్లు తీశాడు.
చదవండి: SA20 2024: సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment