పృథ్వీరాజ్‌ ‘ 81 | Prithviraj Sukumaran Reveals Karachi 81 First Look Poster | Sakshi
Sakshi News home page

పృథ్వీరాజ్‌ ‘ 81

Published Sat, Mar 7 2020 5:29 AM | Last Updated on Sat, Mar 7 2020 5:29 AM

Prithviraj Sukumaran Reveals Karachi 81 First Look Poster - Sakshi

పృథ్వీరాజ్‌

ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌. తాజాగా ఆయన ‘కరాచీ 81’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో ఐదారు గెటప్స్‌లో కనిపిస్తారట. కేయస్‌ బావ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 1971 ఇండియా–పాకిస్థాన్‌ యుద్ధం తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో పృథ్వీరాజ్‌ రా ఏజెంట్‌ పాత్రలో నటించనున్నారు. సినిమాలో కొంత భాగం వరకూ 81 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారు. ఆయన లుక్‌ను కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement