
సాక్షి, హైదరాబాద్ : జిమ్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కసరత్తులు చేస్తున్నారు. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ లో భాగంగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు స్పందించారు. తాను కసరత్తులు చేసి ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో పాటు మరికొందరు స్టార్ హీరోలను ఎన్టీఆర్, సూర్య శివకుమార్, పృథ్వీ సుకుమారన్‌కు ఫిట్‌నెస్ సవాలు విసిరారు. ఈ మేరకు వారి పేర్లను ట్యాగ్ చేస్తూ మోహన్‌లాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మోహన్‌లాల్, ఎన్టీఆర్‌లు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్‌లో కలిసి నటించారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్న సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
ఇదివరకే రాజ్యవర్థన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ వీడియోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌ను ఇటీవల నాగ చైతన్య-సమంత, విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు స్వీకరించి మరికొందరిని సవాల్ స్వీకరించాలని ఆహ్వానించారు. టాలీవుడ్ హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్, లావణ్య త్రిపాఠి సహా పలువురు ఫిట్‌నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తమ స్నేహితులు, సన్నిహితులకు ఫిట్‌నెస్ సవాళ్లు విసురుతున్నారు.
Accepting #FitnessChallenge from @Ra_THORe for #HumFitTohIndiaFit. I invite @Suriya_offl @tarak9999 @PrithviOfficial to join #NewIndia - a healthy India. pic.twitter.com/CVcK2VFArf
— Mohanlal (@Mohanlal) 30 May 2018