
మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్‌లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తయింది.
తాజాగా ‘ఎల్ 2 :ఎంపురాన్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, ఫైనల్ షెడ్యూల్ మొదలైందని పృథ్వీరాజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ప్యాచ్ వర్క్స్‌తో సహా డిసెంబరులోపే మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలన్నది పృథ్వీరాజ్ టార్గెట్ అని మాలీవుడ్ సమాచారం. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా 2025 మార్చి 25న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment