30 ఇయర్స్ పృథ్వీరాజ్‌పై వేధింపుల కేసు
హైదరాబాద్: సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆయన భార్య కవిత పృథ్వీరాజ్ తనను కొంతకాలంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మ అనే మహిళతో పృథ్వీ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కవిత ఫిర్యాదులో పేర్కొన్నారు.
పృథ్వీరాజ్ తన నుంచి రెండు లక్షల నగదుతో పాటు బంగారం తీసుకున్నారని ఆరోపించారు. తనను ఇంట్లోకి రానివ్వడం లదేని, ఇదేంటని ప్రశ్నిస్తే తన ఇష్టమొచ్చినట్లు చేస్తానని అంటున్నారని చెప్పారు. కాగా, మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న కవిత 2010లో పృథ్వీరాజ్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ మేరకు పృథ్వీపై సెక్షన్ 420 మోసం, 498ఏ వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ ఎస్సై కే కృష్ణయ్య తెలిపారు.