రేప్ ప్రత్యక్ష ప్రసారం: ఆ పిల్ల మంచిదట! | Teen Accused Of Live-Streaming Friend Rape Is Good Kid, Court Is Told | Sakshi
Sakshi News home page

రేప్ ప్రత్యక్ష ప్రసారం: ఆ పిల్ల మంచిదట!

Published Wed, Apr 20 2016 4:52 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

రేప్ ప్రత్యక్ష ప్రసారం: ఆ పిల్ల మంచిదట! - Sakshi

రేప్ ప్రత్యక్ష ప్రసారం: ఆ పిల్ల మంచిదట!

మైనర్ అమ్మాయిపై తన స్నేహితుడు అత్యాచారం జరుపుతుండగా.. దానిని పెరిస్కోప్ యాప్‌లో లైవ్ ప్రసారం చేసిన నిందితురాలు తాను ఏ తప్పు చేయలేదని తాజాగా కోర్టుకు తెలిపింది. తాను అమాయకురాలినని, తనపై విధించిన అభియోగాలు ఎత్తివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

18 ఏళ్ల మేరినా లొనినా గత ఫిబ్రవరిలో తన స్నేహితుడు 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తుండగా.. దానిని పెరిస్కోప్‌ యాప్‌లో లైవ్ ప్రసారం చేసింది. అమెరికా ఓహి రాష్ట్రంలోని న్యూ అల్బెనీ హై స్కూల్‌లో చదువుతున్న లొనినా తాజాగా కోర్టు విచారణకు హాజరై.. వాంగ్మూలమిచ్చింది. ఆమె తరఫున మహిళా లాయర్‌ సామ్‌ షమాన్‌స్కీ వాదిస్తూ 'లొనినాకు ప్రతిదీ వీడియోతీసే అలవాటు ఉంది. అందులో భాగంగానే పెరిస్కోప్‌ యాప్‌తో ఈ ఘటనను చిత్రీకరించింది. ఆ సమయంలో తనకు ఏం చేయాలో తోచలేదు. అందుకే పెరిస్కోప్‌ లో లైవ్ ప్రసారం చేస్తూ తానేం చేయాలి? ఎలా ఆపాలి? అని యాప్‌ ఫాలోవర్లను ఆమె అడిగింది' అని కోర్టుకు తెలిపింది. లొనినా మంచి అమ్మాయి అని, ఆమెను ఈ కేసు నుంచి తప్పించాలని న్యాయమూర్తిని కోరింది.

లొనినా, ఆమె స్నేహితుడు రేమండ్ గేట్స్‌ (29) ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 27న గేట్స్ నివాసంలో మైనర్ బాధితురాలితో కలిసి గేట్స్, లొనినా మద్యం సేవించారు. ఆ తర్వాత గేట్స్ మైనర్‌ అమ్మాయిపై అత్యాచారం జరుపగా.. దానిని లొనినా పెరిస్కోప్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కేసులో అభియోగాలు రుజువైతే లొనినా, గేట్స్‌కు 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. బెయిల్ ఇవ్వడానికి లొనినాకు రూ. 82.75 లక్షలు (125000 డాలర్లు), గేట్స్‌కు రూ. 1.99 కోట్లు (రూ.3 లక్షల డాలర్లు) పూచీకత్తుగా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement