పల్లెటూరి నేపథ్యంలో... | Anandam Ambaramaithe movie post productions started | Sakshi
Sakshi News home page

పల్లెటూరి నేపథ్యంలో...

Published Fri, Jun 1 2018 12:18 AM | Last Updated on Fri, Jun 1 2018 12:18 AM

Anandam Ambaramaithe movie post productions started - Sakshi

హాస్యనటుడు పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలో రామకృష్ణ, అవంతికా జంటగా నటించిన చిత్రం ‘ఆనందం అంబరమైతే’. ఈరంకి సుబ్బుని దర్శకునిగా పరిచయం చేస్తూ బుద్దాల సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈరంకి సుబ్బు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి.

అనుకున్నది సాధించినప్పుడు ఆనందం అంబరాన్ని తాకడం సహజం. ఈ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో  ఉంటుంది. గోదావరి తీరంలో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. శ్రీకృష్ణ సంగీతం సినిమాకు హైలెట్‌’’ అన్నారు బుద్దాల సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: చైతన్య వనపల్లె, సహనిర్మాత: బుద్దాల హైమావతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement