Prithviraj Movie Shows Cancelled Due To Zero Occupancy In Theatres - Sakshi
Sakshi News home page

Akshay Kumar: ప్రేక్షకుల్లేక స్టార్‌ హీరో మూవీ రద్దు!

Published Sat, Jun 11 2022 3:03 PM | Last Updated on Sat, Jun 11 2022 3:37 PM

Akshay Kumar Prithviraj Movie Shows Cancelled Due to Zero Occupancy In Theatres - Sakshi

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడదలైన ఈ మూవీ వారానికే బాక్సాఫీసు వద్ద బోల్తా పడిందిన వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లో ప్రేక్షకులు లేకపోవడంతో మూవీ ప్రదర్శనను నిలిపివేసినట్లు బి-టౌన్‌ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిలిం నిర్మించాయి. భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

చదవండి: పాన్‌ ఇండియా చిత్రాలకు ఎందుకన్ని వందల కోట్లు?: తమ్మారెడ్డి భరద్వాజ్‌

పలు వాయిదాల అనంతరం రిలీజ్‌ అయిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల అనంతరం ఈ చిత్రం ఆశించిన స్థాయితో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీకి ఇప్పటి వరకు రూ. 55 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక మూవీపై పెద్దగా టాక్‌ లేని నేపథ్యంలో నేటి షో చూసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో ఓ థియేటర్లో షోని రద్దు చేశారట. ఇక మరికొన్ని చోట్ల థియేటర్లో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ఇక ‘పృథ్వీరాజ్‌’ సినిమా ప్రదర్శనను నిలిపివేశారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా జూన్‌ 3న ఈ మూవీ హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. 

చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement