
ఇంద్రకీలాద్రి: పేద వాడి రాజ్యం రావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. దసరా ఉత్సవాలలో రెండో రోజైన గురువారం శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారిని పృధ్వీరాజ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నా ఆలయ అధికారులు ప్రవర్తించిన తీరు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చిన తనను ఆలయ అధికారులు పట్టించుకోకపోయినా వలంటరీలు, సేవా సిబ్బంది తనను గుర్తించడం చాలా సంతోషమని చెప్పారు. తాను 2012 నుంచి రాజశేఖరరెడ్డి అభిమానినని వివరించారు. రాబోయే ఎన్నికలలో పేదవాడి రాజ్యం రావాలని, అధికార దాహం ఉన్న వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే క్యూలైన్ మార్గాలలో ఏర్పాట్లు బాగున్నాయని పేర్కొన్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు ఫృద్వీరాజ్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహాన్ని చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment