
.. అంటున్నారు పృథ్వీరాజ్. ప్రేమను గెలిపించుకోవడం కోసం అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటా అంటున్నారాయన. పృథ్వీరాజ్‌కి పెళ్లయిన విషయం, ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. మరి.. ప్రేమ కోసం ఇప్పుడు పోరాటం ఏంటి? అంటే.. ‘మీటర్ గాజ్ 1904’ అనే సినిమాలో ఆయన నటించనున్నారు. ‘మేక్ ది ఇంపాజిబుల్.. పాజిబుల్’ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో పృథ్వీరాజ్ తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశాడు? అనేది మెయిన్ థీమ్. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కేరళలోని కురువిల్లాకి చెందిన ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారు.