సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నదైనా శీతల్‌ను ఆయన పెళ్లాడిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: సెన్సార్ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు!)
పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 'లైఫ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. బీనా, నేను ఎప్పుడు వాదనకు దిగేవాళ్లం. ఫస్ట్ తాను నా బెస్ట్ ఫ్రెండ్. వైఫ్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా ఇద్దరి మధ్య ఆర్గుమెంట్స్ ఎక్కువ జరిగేవి. అంతే కాకుండా నా కుమారుడికి ఆటిజం ఉంది. కొడుకుతో నేను ఎక్కువ సమయం కేటాయించేవాడిని. నాతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. నన్ను బాగా అర్థం చేసుకునేవాడు. నేను ఫ్రస్టేషన్‌లో ఉన్నప్పుడు కుమారుడిని చూస్తే చాలు. ఒక్కోసారి దేవుడు నా ఇలాంటి కొడుకును ఇచ్చాడే అని బాధపడేవాణ్ని. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయా. చాలా కోపంగా కూడా ఉండేది. కానీ శీతల్‌తో నా కుమారుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.' అని అన్నారు.
(ఇది చదవండి: ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్)
రెండో భార్య శీతల్ గురించి మాట్లాడుతూ..'శీతల్ వచ్చాక నా లైఫ్ మారిపోయింది. ఆ అమ్మాయికి దైవభక్తి ఎక్కువ. చిన్న వయసే అయినప్పటికీ ఫుల్ మెచ్యూరిటీ మైండ్. తనకు బాగా క్లారిటీ ఉంది. ఆమె వచ్చాకే నా కెరియర్, లైఫ్ పూర్తిగా మారిపోయింది. అని అన్నారు. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లి కాగా, కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment