Bablu
-
'డిప్రెషన్లోకి వెళ్లిపోయా.. రెండో భార్య వచ్చాక లైఫ్ మారిపోయింది'
సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నదైనా శీతల్‌ను ఆయన పెళ్లాడిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: సెన్సార్ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు!) పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 'లైఫ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. బీనా, నేను ఎప్పుడు వాదనకు దిగేవాళ్లం. ఫస్ట్ తాను నా బెస్ట్ ఫ్రెండ్. వైఫ్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా ఇద్దరి మధ్య ఆర్గుమెంట్స్ ఎక్కువ జరిగేవి. అంతే కాకుండా నా కుమారుడికి ఆటిజం ఉంది. కొడుకుతో నేను ఎక్కువ సమయం కేటాయించేవాడిని. నాతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. నన్ను బాగా అర్థం చేసుకునేవాడు. నేను ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు కుమారుడిని చూస్తే చాలు. ఒక్కోసారి దేవుడు నా ఇలాంటి కొడుకును ఇచ్చాడే అని బాధపడేవాణ్ని. డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయా. చాలా కోపంగా కూడా ఉండేది. కానీ శీతల్‌తో నా కుమారుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.' అని అన్నారు. (ఇది చదవండి: ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్) రెండో భార్య శీతల్ గురించి మాట్లాడుతూ..'శీతల్ వచ్చాక నా లైఫ్ మారిపోయింది. ఆ అమ్మాయికి దైవభక్తి ఎక్కువ. చిన్న వయసే అయినప్పటికీ ఫుల్ మెచ్యూరిటీ మైండ్. తనకు బాగా క్లారిటీ ఉంది. ఆమె వచ్చాకే నా కెరియర్, లైఫ్ పూర్తిగా మారిపోయింది. అని అన్నారు. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లి కాగా, కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
కన్నవారికి కడుపు కోత మిగిల్చి.. భరోసానిచ్చేనా?
మెదక్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి జాదవ్బబ్లూ అంత్యక్రియలు మండలంలోని నాగపూర్‌లో బుధవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అతడి పార్థీవదేహం సొంతూరకు మధ్యాహ్నానికి చేరుకుంది. అప్పటికే వేచియున్న కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడే సురేశ్ షెట్కార్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మృతుడి తండ్రి సంతోష్నాయక్తోపాటు కుటుంబీకులను ఓదార్చారు. రూ.5వేల నగదు ఆర్థిక సాయం అందజేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి కూడా సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. రెండు నెలలు కాకుండానే.. ట్రిపుల్‌ఐటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అప్పట్లో స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని, మెయిల్ పద్ధతిలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. జూన్‌లో 48 గంటల వ్యవధిలో విద్యార్థినులు వడ్ల దీపిక, బూర లిఖిత ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ.. ఆ ఘటనలు జరిగి రెండు నెలలు కాకుండానే పీయూసీ–1 విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితాలపై సమీక్ష చేయడంలేదనే విమర్శలున్నాయి. తాజాగా బుధవారం మరోసారి ఇదే విషయమై వీసీ వెంకటరమణ కొత్త నిబంధనలు తెరపైకితెచ్చారు. ఇప్పటికై నా నిబంధనలు అమలు చేసి విద్యార్థుల్లో భరోసా నింపాల్సిన అవసరముందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు... జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో బుధవారం కూడా క్యాంపస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్, వీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరాం తదితరులు కళాశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, వీరిని ప్రధాన గేటు వద్ద భద్రత సిబ్బంది, పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిర్మల్ ఆస్పత్రి వద్ద బబ్లూ మృతదేహాన్ని తరలించేదాకా ఎవరినీ అనుమతించలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్, ఎన్ఆర్ఐ బాజీరావుబోస్లేతోపాటు పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిర్మల్ ఆస్పత్రి నుంచి బబ్లూ మృతదేహాన్ని తీసుకువెళ్లిన బంధువులు స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం నాగాపూర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బబ్లూ మృతికి వీసీ వెంకటరమణ, సిబ్బంది కళాశాలలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా బబ్లూ కుటుంబానికి వీసీ వెంకటరమణ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇకనుంచి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు చెప్పుకోలేని విషయాలను తెలుసుకునేందుకు కొత్తగా ముగ్గురు కౌన్సిలర్లను నియమిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం పది రోజుల్లో ప్రధాన ద్వారం వద్ద ఒక పేరెంట్స్ లాంజ్ ఏర్పాటు చేస్తామన్నారు. బాసర మండలం నుంచి ఎంపికై న 15మంది విద్యార్థులతో కలిసి ‘వీసీ మై విలేజ్’ ప్రోగ్రాంను నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలో ‘సలహా’ బాక్స్‌లు ఏర్పాటుచేసి 15రోజులకోసారి తెరిచి అందులో విద్యార్థులు లేఖల ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు బెదిరింపులకు గురైతే మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలిపినా రక్షణ కల్పిస్తామని తెలిపారు. -
బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా, నారాయణఖేడ్: బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ–1 చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన బబ్లూ గతనెల 31న బాసర ట్రిపుల్‌ఐటీలో చేరాడు. నాలుగు రోజులుగా నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సోమవారం నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. పీయూసీ–1లో అడ్మిషన్ పొందిన జాదవ్ బబ్లూ తరగతులకు హాజరైన రెండోరోజే హాస్టల్ బ్లాక్‌లో ఉరేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. కాగా ట్రిపుల్‌ఐటీలో రెండు నెలల క్రితం జూన్ 14న సిద్దిపేట జిల్లాకు చెందిన బోర లిఖిత అనే విద్యారి్థని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగిన కొద్దిసేపటికే ‘‘నాన్నకు జ్వరం ఎలా ఉందని అడిగాడు.. కొద్ది సేపటికే మీ బిడ్డ చనిపోయాడని కళాశాల నుంచి పిడుగులాంటి వార్త విని గుండె పగిలినంత పని అయింది’అని జాదవ్ బబ్లూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నా బిడ్డ చక్కగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతాడనుకుంటే గర్భశోకం మిగిల్చాడని భోరుమని విలపించారు. ఇలా ఎందుకు చేశాడో తెలియదని విలపించారు. కాంగ్రెస్ ఆందోళన.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నిర్మల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లేందుకు యతి్నంచారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికే బాసరలో 20మంది విద్యార్థులు చనిపోయారనీ, ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే పాలకులు స్పందిస్తారని కాంగ్రెస్ నియోజకవర్గ నేత కూచాడి శ్రీహరిరావు ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే సీఎం కేసీఆర్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాగా ట్రిపుల్ ఐటీ అధికారులు బబ్లూ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలని నినదించారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అలా పరిమితం కావడం సరికాదు!
కేంద్ర ప్రభుత్వం రసాయనిక వ్యవసాయం నుంచి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది మాత్రమే చాలదు. కేవలం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జడ్.బి.ఎన్.ఎఫ్.) ఒక్కదాని పైనే దృష్టి కేంద్రీక రించడంలో అర్థం లేదు. ప్రకృతి వ్యవసాయం అనేది జపాన్‌కు చెందిన డా. మసనోబు ఫుకుఓకా వాడుకలోకి తెచ్చిన విషయం. దీనితోపాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం, బయోడైనమిక్ వ్యవసాయం వంటి అనేక రసాయనికేతర వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి. మొత్తంగా కలిపి సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరింత మేలు జరుగుతుంది. కేవలం దేశీ ఆవులు, కేవలం జీవామృతం చాలు అనలేం. మన దేశంలో 85% భూముల్లో వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతోంది. రైతుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. అనంతపురం వంటి కరువు పీడిత జిల్లాలో మేం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. మెట్ట భూములు జీవాన్ని కోల్పోయాయి. మట్టిని సారవంతం చేసుకుంటేనే ఈ భూముల్లో వ్యవసాయాన్ని చేపట్టగలం. భూసారం, నీటి పారుదల బాగా ఉండే ప్రాంతాల్లో జీవామృతం సరిపోవచ్చు. కానీ మెట్ట ప్రాంతాల్లో విధిగా కంపోస్టు తయారు చేసుకోవాలి. అంటే రైతుకు పశువులు కావాలి. దేశీ ఆవు మంచిదే. 2 వేల దేశీ ఆవులు రైతులకు పంచాం. అయితే, ఇతర ఆవులైతే పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి రైతుకు ఆసరాగా కూడా ఉంటుంది. పాలు తక్కువ ఇచ్చే ఆవులను చిన్న రైతు పెంచుకోవటం భారమే. వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం మంచిదే. అయితే, జడ్.బి.ఎన్.ఎఫ్.కు మాత్రమే పరిమితం కావటం అరకొర ప్రయత్నమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేచర్ బేస్డ్ వ్యవసాయ పద్ధతుల్లో ఉన్న అనుభవాలను సైతం ఇముడ్చుకునే విధంగా ప్రభుత్వ విధానం సమగ్రంగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ప్రకృతి సేద్యమే వెలుగు బాట) - సి.కె. గంగూలి (బబ్లూ) సహ వ్యవస్థాపకులు, టింబక్టు కలెక్టివ్, చెన్నేకొత్తపల్లి -
చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
-
చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
లక్ష్మణచందా: ఆడుకోవడానికి చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం వడ్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు లక్కీ(10) బబ్లూ(7), రాజు(6) ఈరోజు చెరువు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయారు. ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను వెలికి తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పులి... చిన్నారిని చంపేసింది
పాట్నా: ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెరిహండీ గ్రామ సమీపంలో వాల్మీకి నేషనల్ పార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామ పరిధిలో చిన్నారి బబ్లూ ఆటలాడుకుంటున్నాడు. ఆ క్రమంలో బబ్లూపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. అనంతరం అతడి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చిన్నాభిన్నం చేసింది. దాంతో గ్రామస్తులు, పార మిలటరీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే వాల్మీకి నేషనల్ పార్క్‌లో పులుల సంఖ్య గత మూడేళ్ల కాలవ్యవధిలో రెండింతలు అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్క్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం మృతి చెందిన బబ్లూ కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందజేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం