లండన్‌లో ప్రణయం | 'Love in London' is getting ready for release | Sakshi
Sakshi News home page

లండన్‌లో ప్రణయం

Published Wed, Jul 9 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

లండన్‌లో ప్రణయం

లండన్‌లో ప్రణయం

అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. లండన్‌లో ఉద్యోగం. ఆమె ఓసంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటారు. అతను తనకు తగినవాడేనా? అని ఆ అమ్మాయి, తనకు తగ్గ భార్యేనా అని అతను డైలమాలో పడతారు. చివరికి ఓ రోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. పెళ్లికి సుముఖంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోకి ఇంకో అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే కథాంశంతో రూపొందిన ఓ మలయాళ చిత్రం ‘లవ్ ఇన్ లండన్’ పేరుతో అనువాదమైంది.
 
 ఎస్‌సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సుంకేశుల రాజబాబు ఈ చిత్రాన్ని అనువదించారు. పృథ్వీరాజ్, ఆండ్రియా, నందిత నాయకా నాయికలు. ఇటీవలే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. రాజబాబు మాట్లాడుతూ -‘‘ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ను 99 శాతం లండన్‌లోనే చేశారు. దర్శకుడు అనిల్ సి. మీనన్ అద్భుతంగా తీశారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: మహేశ్ దత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement