లండన్ లో ఏం జరిగిందంటే..!? | Love in London movie songs released | Sakshi
Sakshi News home page

లండన్ లో ఏం జరిగిందంటే..!?

Published Wed, Aug 20 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

లండన్ లో ఏం జరిగిందంటే..!?

లండన్ లో ఏం జరిగిందంటే..!?

‘‘తెలుగు సినీ కళాకారులకు మరింత ఉపాధి దొరకాలంటే... చిన్న సినిమాలు విజయం సాధించాలి. తెలుగు సినిమా కళకళలాడేది అప్పుడే’’ అని మురళీమోహన్ అన్నారు. పృధ్వీరాజ్, ప్రతాప్‌పోతన్, ఆండ్రియా, నందిత ప్రధాన పాత్రధారులుగా అనిల్ సి.మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘లండన్ బ్రిడ్జ్’. ఈ చిత్రం ‘లవ్ ఇన్ లండన్’గా తెలుగులో విడుదల కానుంది. సుంకేశుల రాజాబాబు నిర్మాత. రాహుల్‌రాజ్, శ్రీవల్సన్ జె. మీనన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో మురళీమోహన్ ఆవిష్కరించారు.
 
నిర్మాత మాట్లాడుతూ -‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం లండన్‌వెళ్లిన ఓ యువకుడికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథ. మానవసంబంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘ప్రేమకథాచిత్రమ్’ తర్వాత తనకు లభించిన మరో విజయమిదని, మలయాళంలో కూడా విజయాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందని నందిత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement