Kaaviya Thalaivan
-
దైవాన్నే నమ్ముకున్నా!
ఏ వృత్తిలోనైనా రాణించాలంటే ప్రతిభ ఉండాలంటారు. అయితే ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం తోడవ్వాలంటారు మరి కొందరు. అదృష్టం ఉన్నా దైవానుగ్రహం కావాలంటారు ఇంకొందరు. నటి వేదిక ఈ మూడో కోవకు చెందిన వారే. అదృష్టంకన్నా దైవాన్నే నమ్ముతానంటున్న ఈ భామ నటిగా మాత్రం మంచి ప్రతిభాశాలినేనని చెప్పక తప్పదు. ఆ మధ్య వచ్చిన పరదేశి, ఇటీవల తెరపైకి వచ్చిన కావ్య తలైవన్లాంటి చిత్రాలే వేదిక ప్రతిభా పాఠవాలకు నిదర్శనం. ఈ ముద్దుగుమ్మ నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ స్టార్‌గా ఎదగలేకపోయూరు. అయితే తాజాగా ఈమె అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ ఖాతాను ప్రారంభించనున్నారట. అందులో అభిమానులతో ఆమె అనుభవాలు, అనుభూతులు పంచుకోవడంతోపాటు చిత్ర లేఖనాలు, తన చిత్ర విశేషాలు, వీడియో క్లిప్పింగ్స్ లాంటివి పొందుపరచనున్నారట. దీని గురించి వేదిక తెలుపుతూ తానిప్పటివరకు నటించిన చిత్రాల్లో బాలా దర్శకత్వంలో పరదేశి చిత్రంలో పాత్ర తనకు చాలా నచ్చిందన్నారు. అది నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్ర అని చెప్పారు. అదే విధంగా వసంతబాలన్ దర్శకత్వంలో చేసిన కావ్యతలైవన్ చిత్రంలో వైవిధ్యభరిత పాత్రను పోషించానని తెలిపారు. ఇది 1930 దశాబ్దంలో ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించిన చిత్రమని, దీని కోసం తొలి నాటక నటి సుందరాంబాల్ గురించి, అప్పటి ప్రజల నడవడికలను తెలుసుకోవడానికి ఎక్కువగానే శ్రమించానని వివరించారు. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో శివలింగ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. మరో విషయం ఏమిటంటే తాను అదృష్టం కంటే దైవాన్నే పూర్తిగా నమ్ముతానని చెప్పారు. మలయాళ చిత్రాలు నటించడం మొదలెట్టిన తరువాత గురువాయురప్ప భక్తురాలినయ్యానని వెల్లడించారు. అభిమానులు తనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని వారి చిత్ర లేఖనాలను, వీడియోలను అభిప్రాయాలను తనతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా వేదిక టాలెంట్ గ్యాలరీ పేరుతో ఫేస్‌బుక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. -
తమిళంలో వినూత్న యత్నం
తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. ఇటీవల తెలుగులో పెద్దగా కనిపించని ఈ నటుడు తమిళంలోనూ సరైన హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యంలోని కాల్పనిక కథతో తమిళంలో రూపొందుతోన్న ‘కావ్య తలైవన్’ (కావ్య నాయకుడు అని అర్థం)పై ఆయన ఆశలు పెట్టుకున్నారు. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో మదురై లాంటి ప్రాంతంలో ఊరూరూ తిరుగుతూ, నాటకాలు ప్రదర్శించే ఒక చిన్న రంగస్థల సమాజం నేపథ్యంలోని కథ ఇది. అందులోని ఇద్దరు నటుల మధ్య నెలకొనే పోటాపోటీ చిత్ర ప్రధానాంశం. అలా పోటీపడే రంగస్థల నటులుగా సిద్ధార్థ్, మలయాళ హీరో పృథ్వీరాజ్ కనిపిస్తారు. నాయిక పాత్రను వేదిక పోషిస్తున్నారు. ఒకప్పటి ప్రముఖ రంగస్థల నటి, గాయని, సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్న తార కె.బి. సుందరాంబాళ్ (‘అవ్వయ్యార్’ చిత్రం ఫేమ్) ప్రేరణతో ఆ కథానాయిక పాత్ర తీర్చిదిద్దారని కోడంబాకం కబురు. విభిన్నమైన చిత్రాల నిర్దేశకుడిగా పేరున్న వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 1920ల నాటి రంగస్థల సంగీతానికి తగ్గట్లుగా బాణీలు కట్టి, రీరికార్డింగ్ చేయడం కోసం రహమాన్ దాదాపు ఆరు నెలలు పరిశోధన చేశారట. రెండేళ్ళ పైగా సాగిన ఈ భారీ ప్రయత్నానికి తగ్గట్లే ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ‘‘ఊరూరా తిరుగుతూ, తమ నాటకంలోని ఒక ఘట్టాన్ని రోడ్డు మీదే ప్రదర్శించి, ఆకట్టుకొనే అప్పటి రంగస్థల కళాకారుల జీవితంపై సినిమా ఇది. అందుకే, మా చిత్ర బృందం కూడా తమిళనాడులోని ప్రధాన పట్టణాలన్నీ తిరుగుతూ, రకరకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకర్షించనున్నాం’’ అని దర్శకుడు వసంత బాలన్ చెప్పారు. నవంబర్ 14న తమిళనాట విడుదల కానుంది. -
కావ్య తలైవన్ చిత్రంలో సిద్దార్థ గెటప్స్
-
విభిన్నపాత్రలతో ఆలరించిన సిద్ధార్థ్
గతంలో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైలన సిద్ధార్థ్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు. జిగర్ తాండ్ (చిక్కడు దొరకడు) చిత్రంతో ఓ డిఫరెంట్ లుక్, విభిన్నమైన పాత్రను పోషించి వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జిగర్ తాండ తర్వాత కావ్య తలైవన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కావ్య తలైవన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. కావ్య తలైవన్ ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో ఆ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కావ్య తలైవన్ చిత్రంలోని సిద్దార్థ గెటప్స్ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వివిధ గెటప్ లో ఉన్న స్టిల్స్ నటుడిగా సిద్ధార్థను కొత్త ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రహ్మన్ అందిస్తున్నారు. సిద్ధార్థ తోపాటు పృథ్వీరాజ్, నాజర్, వేదిక, అనైక సోటిలు నటిస్తున్నారు. -
నాటకాలైనా సిద్ధార్థ్‌ను నిలబెట్టేనా?!