బాహుబలి నటుడి ఇంట్లో తీవ్ర విషాదం..! | Nassar Father Mahaboob Basha Passed Away At the Age Of 94 | Sakshi
Sakshi News home page

Nassar: ఇండస్ట్రీలో మరో విషాదం.. నాజర్ తండ్రి కన్నుమూత!

Oct 10 2023 5:40 PM | Updated on Oct 10 2023 6:18 PM

Nassar Father Mahaboob Basha Passed Away At the Age Of 94 - Sakshi

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యంతో బాధపడుతున్న మహబూబ్ బాషా (94)  తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలైలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నాజర్‌ను పరామర్శించారు. 

(ఇది చదవండి: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం)

నాజర్ తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. బాహబలి చిత్రంలో కీలక పాత్ర పోషించారు. విభిన్నమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  టాలీవుడ్‌ అగ్ర హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించారు. ప్రస్తుతం ఆయన ధనుశ్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. నటించిన కాగా.. సోమవారం రాత్రి టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు  తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ విషాదం నెలకొంది.   

(ఇది చదవండి: హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement