తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. అయితే అందరూ తెలుగువాళ్లేనా అంటే కాదు. పరభాషల నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడివాళ్ల కంటే బోలెడంత క్రేజ్ సంపాదించిన నటులు చాలా అంటే చాలామంది. వాళ్లలో నాజర్ ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు. పుట్టిపెరిగింది తమిళనాడులో అయినా దాదాపు ఆరు భాషల్లో కలిపి 600 వరకు సినిమాల్లో నటించారు. తెరపై అంరినీ అలరిస్తున్న ఈయన.. కొడుకు విషయంలో తీరని కష్టాన్ని దిగమింగుతున్నాడని మీలో ఎవరికైనా తెలుసా?
1985లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాజర్.. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు ఈయన ఉండాల్సిందే. సినిమాల పరంగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ఈయన.. తన వారసుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. రెండో కొడుకు ప్రస్తుతం నటుడిగా ఉన్నప్పటికీ.. పెద్ద కొడుకు విషయం మాత్రం ఈయన్ని ఎప్పుడూ కృంగదీస్తూనే ఉంటుంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!)
నాజర్‌కి ముగ్గురు కొడుకులు. అందులో పెద్దోడి పేరు అబ్దుల్ ఫైజల్ హాసన్. తండ్రిలానే నటుడు కావాలనుకున్నాడు. నాజర్‌కు ఈ విషయం తెలిసి, హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసి సన్నాహాలు చేశాడు. అంతలోనే పెద్ద కుదుపు. నాజర్ పెద్ద కొడుకు ప్రయాణిస్తున్న కారు ఘోరమైన ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ పూర్తిగా వీల్ ఛైర్ లేదా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలా మరికొన్ని రోజుల్లో హీరో అవుతాడనుకున్న పెద్ద కొడుకు.. జీవచ్ఛవంలా మంచానికే పరిమితమయ్యేసరికి నాజర్ మానసికంగా కృంగిపోయాడు. ఇదే పెద్ద బాధ అనుకుంటే పూర్తిగా గతాన్ని మర్చిపోవడం నాజర్‌ని మరింత వేదనకు గురిచేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. నాజర్ కొడుకు వాళ్ల ఫ్యామిలీని మర్చిపోయాడు గానీ హీరో విజయ్‌ని గుర్తుపెట్టుకున్నాడు. టీవీలో అతడి పాట వచ్చినా, సినిమా వచ్చినా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయం తెలిసి విజయ్.. ఈ ఏడాది నాజర్ పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇలా తెరపై అద్భుతమైన నటనతో అలరిస్తున్న నాజర్ జీవితంలో ఇంత విషాదం ఉందని బహుశా మీలో చాలామందికి తెలిసుండకపోవచ్చేమో!
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!)
Comments
Please login to add a commentAdd a comment