Musalodiki Dasara Pandaga Trailer Out Now - Sakshi
Sakshi News home page

Musalodiki Dasara Pandaga: ముసలోడికి దసరా పండగ ట్రైలర్‌ చూశారా?

Published Fri, May 27 2022 1:11 PM | Last Updated on Wed, Jun 1 2022 9:16 PM

Musalodiki Dasara Pandaga Trailer Out Now - Sakshi

నాజర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. డి. మనోహర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీనాయుడు, సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణ వాళ్లె నిర్మించారు.

తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను నాజర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ– ‘‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణగారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు.

చదవండి 👇
నటుడిని పెళ్లాడనున్న బాలీవుడ్‌ హీరోయిన్‌

Rakul Preet Singh: సౌత్‌, నార్త్‌ రెండూ కలిస్తే అద్భుతాలే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement