ఎట్టకేలకు 'నడిగర్‌' ఫలితాలు విడుదల, గెలిచిందెవరంటే? | Nassar Win as President of the Nadigar Sangam For 2nd Time | Sakshi
Sakshi News home page

Nassar: మూడేళ్లకు 'నడిగర్‌ సంఘం' ఓట్ల లెక్కింపు, రెండోసారి నాజర్‌; విశాల్‌లదే గెలుపు

Mar 20 2022 6:29 PM | Updated on Mar 20 2022 7:32 PM

Nassar Win as President of the Nadigar Sangam For 2nd Time - Sakshi

నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌ రెండోసారి విజయఢంకా మోగించాడు. ప్రధాన కార్యదర్శిగా రెండోసారి విశాల్‌ గెలుపొందాడు. ట్రెజరర్‌గా హీరో కార్తీ విజయం సాధించాడు.

చెన్నై (తమిళనాడు): దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌ రెండోసారి విజయఢంకా మోగించగా ప్రధాన కార్యదర్శిగా విశాల్‌ రెండోసారి గెలుపొందాడు. నడిగర్‌ సంఘం ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించాడు. కాగా

 2019లో నడిగర్‌ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ సెక్రటరీగా ఒక ప్యానల్‌ నుంచి కె. భాగ్యరాజ్‌ అధ్యక్షుడిగా, గణేశన్‌ సెక్రటరీగా మరో ప్యానల్‌ నుంచి పోటీ చేశారు. ఓటింగ్‌లో హీరో విశాల్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందడంతో మద్రాస్‌ కోర్టు కౌంటింగ్‌ను ఆపేసింది. తాజాగా రిటైర్డ్‌ జడ్జి సమక్షంలో కౌంటింగ్‌ జరపగా మరోసారి నాజర్‌ ప్యానెల్‌ గెలుపొందింది.

చదవండి: Sarkaru Vaari Paata: పెన్నీ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement