తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు.
'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు.
ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు.
Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building.
— Ramesh Bala (@rameshlaus) April 23, 2024
He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t
Comments
Please login to add a commentAdd a comment