
టీ.నగర్: ఐదు నియోజకవర్గాల్లో ఘోర ఓటమి పొందనున్న తమిళిసై సౌందరరాజన్ నోటా కంటే అధిక ఓట్లు సాధించాలని నటి కుష్బూ ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బూ ఆదివారం మాట్లాడుతూ కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణా, ఒడిశా రాష్ట్రాలలో ప్రచారం చేశానని, తదుపరి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కోరిక ప్రజల్లో ఉందన్నారు. అందువల్ల కాంగ్రెస్ విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిపారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకనే చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై పై తనకు గౌరవం ఉందని, ఆమె కూడా ఒక మహిళ అయినందున నోటా కంటే తక్కువ ఓట్లు పొంది ఓడిపోకూడదని అన్నారు. తమిళనాట డీఎంకే–కాంగ్రెస్ కూటమి 35 నుంచి 36 స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment