ఫైర్‌బ్రాండ్ నటిగా ముద్ర వేసుకున్న నటి, బీజేపీ అధికార ప్రచారకర్త కుష్బూ గురువారం సాయంత్రం మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఇమె ఇటీవలే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్స పొంది డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. ఈమె ఇటీవల తనను కించపరిచేలా మాట్లాడిన స్థానిక డీఎంకే ప్రచారకర్తపై చెన్నై పోలీస్ కమిÙనర్‌కు ఫిర్యాదు చేసి ఆయనకు మీడియా ద్వారా స్ట్రాంగ్ వారి్నంగ్ ఇచ్చి వార్తల్లోకెక్కారు.
ఇలాంటి పరిస్థితుల్లో కుష్బూ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వెన్నెముక మళ్లీ నొప్పిగా ఉండడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ సారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment