అత్తమ్మ కల నెరవేర్చిన బీజేపీ నేత ఖుష్బూ | Khushbu Sundar Post On PM Meeting Her Ma In law | Sakshi
Sakshi News home page

అత్తమ్మ కల నెరవేర్చిన బీజేపీ నేత ఖుష్బూ

Published Sun, Jan 21 2024 12:47 PM | Last Updated on Sun, Jan 21 2024 2:15 PM

Khushbu Sundar Post On PM Meeting Her Ma In law - Sakshi

సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ తన అత్తమ్మ కలను నెరవేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలన్న తన అత్తమ్మ కల నెరవేరిందని ఖుష్బూ సుందర్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌లో తెలిపారు. తను, ఆమె అత్తమ్మ దైవనై చిదంబరం పిళ్లై.. ప్రధాని మోదీతో దిగిన పలు ఫొటోలను పోస్ట్‌ చేశారు.

‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పడానికి నా వద్ద తగిన మాటలు లేవు. మా అత్తమ్మ కల నిజం చేసి.. ఆమెలో సంతోషం నింపినందుకు పీఎం మోదీ కృతజ్ఞతలు. 92 ఏళ్లు ఉన్న తన అత్తమ్మ మోదీకి చాలా పెద్ద అభిమాని. జీవితంలో ఒక్కసారైనా ఆమె మోదీని కలవాలని కలలు కనేది. ప్రస్తుతానికి ఆమె కల నిజమైవటం పట్ల అత్తమ్మతో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా’ అని ఖుష్బూ కామెంట్‌ జత చేశారు

‘ప్రధాని మోదీ ప్రపంచంలోనే గొప్ప పేరున్న నేత. చాలా ప్రేమగా, మర్యాదతో మా అత్తమ్మతో మోదీ మాట్లాడారు. ఒక తల్లితో కుమారుడు ఎలా మాట్లాడుతారో.. అచ్చం అలానే తన అత్తమ్మతో ఆప్యాయంగా మాట్లాడారు.అందుకే మోదీని ప్రజలంతా ఇష్టపడటం, అభిమానిస్తారు. దేవుడి ఆశీర్వాదం పొందిన గొప్పమనిషి మోదీ’ అని ఆమె సుదీర్ఘంగా రాసుకోచ్చారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఖుష్బూ కోరిక మేరకు ఆమె అత్తమ్మను కలిసి.. కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు.

ఇక.. పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గొప్ప పేరు సంపాధించుకున్న ఖుష్బూ 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆమె నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

చదవండి: గ్రామాలపై బీజేపీ ఫోకస్‌.. ప్రచారానికి కొత్త కార్యక్రమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement