తమిళ మీడియాపై కుష్బూ ఆగ్రహం!
బీజేపీలో చేరుతారంటూ మీడియా చేస్తున్న ప్రచారంపై కుష్బూ మండిపడ్డారు.
చెన్నై: బీజేపీలో చేరుతారంటూ మీడియా చేస్తున్న ప్రచారంపై కుష్బూ మండిపడ్డారు. డీఎంకే పార్టీకి సోమవారం కుష్బూ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకే కుష్బూ డీఎంకే పార్టీని వీడిందంటూ చేస్తున్న వ్యాఖ్యలు సరికావని ఆమె ట్విటర్ లో ట్వీట్ చేసింది.
నేను ఎప్పడూ ఏ పార్టీలో చేరడానికి ముందుగాని.. ప్రస్తుతంగాని ప్రయత్నించడం లేదు. తెల్ల కాగితాన్ని నింపేందుకు కష్టపడుతున్న పేపర్లు ఇలాంటి రాతల్ని ఆపితే సంతోషిస్తాను అని ట్విట్ చేశారు. డీఎంకే పార్టీని వీడిన కుష్బూ బీజేపీలో చేరుతారంటూ తమిళ పత్రికలు కథనాలు ప్రచురించడంపై కుష్బూ తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు.