చెన్నై: తీవ్రమైన మానసిక ఒత్తిడితో తానుకూడా ఒకానొక సమయంలో జీవితాన్ని ముగించాలనుకున్నానని ప్రముఖ నటి ఖుష్బూ అన్నారు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు, సమస్యలు ఉంటాయని.. వాటిని ధైర్యంగా అధిగమించాలే తప్ప ఆత్మహత్య సరైంది కాదని ట్విటర్‌లో పేర్కొన్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
'జీవితంలో నాకు కూడా సమస్యలు ఎదురయ్యాయి. మానసిక క్షోభ అనుభవించా. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకున్నా' అని కుష్బూ గతాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఒకానొక దశలో నా జీవితం స్తంభించిపోయింది. అంతా చీకటిమయంగా తోచింది. భయం, ఆందోళన పెరిగింది. ఈ సమస్యల్ని భరించడం కంటే శాశ్వత నిద్రలోకి వెళ్లడం సులభమైన మార్గం అనుకున్నా. కానీ నాలోని ధైర్యం ఆ ఆలోచనలను అధిగమించేలా చేసింది’అని తెలిపారు.
(చదవండి: సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!)
ప్రతి మనిషిలో బాధ, ఒత్తిడి ఉంటాయని, బాధలు లేవని చెప్పడం అబద్ధమే అవుందని ఖుష్బూ అన్నారు. పోరాడే శక్తి ఉంది కాబట్టే తాను ఇంత దూరం రాగలిగానని, ధైర్యంగా ముందడుగువేసి పరాజయాలను విజయాలుగా మార్చుకోవడం నేర్చుకున్నానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. వరుస ట్వీట్లలో జీవితానుభవాలు పంచుకుని అభిమానుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.
(చదవండి: సుశాంత్ 50 కోరికల జాబితా ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment