యువకుడి చెంప పగలగొట్టిన కుష్బూ | Congress Leader Kushboo SlapsYouth During roadshow in Bengaluru | Sakshi
Sakshi News home page

యువకుడి చెంప పగలగొట్టిన కుష్బూ

Apr 11 2019 5:10 PM | Updated on Apr 11 2019 8:41 PM

Congress Leader Kushboo SlapsYouth During roadshow in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు : ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ తనతో అభ్యంతకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి గూబ గుయ్యిమనిపించారు. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా పార్టీ తరపున బుధవారం బెంగళూరులో ఆమె రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్- జేడీఎస్ బెంగళూరు సెంట్రల్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున ప్రచారం నిర్వహిస్తుండగా కుష్బూ పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహంతో  రగిలిపోయిన  కుష్బూ  హఠాత్తుగా వెనక్కి  తిరిగి అతగాడి  చెంప చెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కిక్కిరిసిన జనం మధ్య ప్రచారం కొనసాగుతుండగా ఒకసారి తాకాడు..వెనక్కి తిరిగి చూసి ప్రచారంలో మునిగిపోయాను..మళ్లీ అదే పని చేశాడు. దాంతో ఒళ్లు మండి ఒక‍్కటిచ్చానని కుష్పూ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై  రిజ్వాన్  మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. 

దీనిపై  నెటిజన్లు  ఆమె రియాక్షన్‌ పట్ల సంతోషం వ్యక్తం చేసి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారిపట్ల ఇలాగే స్పందించాలని, వారికి గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. దీన్నే కన్నడలో కపాల మోక్ష అంటారని,  వేధింపులకుగురవుతున్న జర్నలిస్టులు కుష్బూ నుంచి నేర్చుకోవాలంటూ ఒక జర్నలిస్టు యూజర్‌ ట్వీట్‌ చేయడం విశేషం. మరోవైపు సదరు యువకుడిని స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు  పోలీసులకు అప్పగించారు.    



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement