ఆ ఆలయంలో ఒక ‍ప్రత్యేకత.. ఈసారి ఖుష్బూను వరించిన అదృష్టం | Actress Khushbu Sundar Gets Naari Puja At Thrissur Vishnumaya Temple - Sakshi
Sakshi News home page

విష్ణు మాయ దేవాలయం ప్రత్యేకత ఇదే.. ఆ దైవమే ఖుష్బూను ఇలా ఎంపిక చేసిందా?

Published Wed, Oct 4 2023 6:56 AM | Last Updated on Wed, Oct 4 2023 11:09 AM

Khushbu Says God Chose In Vishnu Maya Temple - Sakshi

బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ నటీమణుల్లో ఖుష్బూ ఒక్కరు. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టి పెరిగిన ఈమె దక్షిణాదిలో ప్రముఖ నటిగా రాణిస్తుండటమే కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారడం విశేషం. కుష్బూ ఏ రాజకీయ పార్టీలో ఉన్న తన గళాన్ని గట్టిగా వినిపిస్తారు. ఇదే ఆమె ప్రత్యేకత. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న కుష్బూకు ఇటీవల ఒక అరుదైన గౌరవం దక్కింది. తిరుచూర్‌లోని విష్ణు మాయ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది.

(ఇదీ చదవండి: శివాజీ పిచ్చి ప్రవర్తన.. గేమ్‌లో ఏకంగా బెంచ్‌నే తన్నేశాడు!)

ఈ ఆలయంలో ఏడాదికోసారి జరిపే ప్రత్యేక నారీ పూజ కార్యక్రమాలకు ఓ మహిళను ఆహ్వానిస్తారు. అలా ఈ ఏడాది ఆ గౌరవం నటి కుష్బూకు దక్కింది. ఆ ఆలయ నిర్వాహకులు నటి కుష్బూను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ పూజా కార్యక్రమం ఎప్పుడు జరిగిందో గానీ, నటి కుష్బూ ఈ విషయాన్ని మంగళవారం తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో విష్ణు మాయ ఆలయంలో నారీ పూజ కోసం తనను ఆహ్వానించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ పూజలో ఎంపిక చేయబడిన వారు మాత్రమే ఆహ్వానితులని చెప్పారు. వారిని ఆ దైవమే ఎంపిక చేస్తుందని ఆలయ నిర్వాహకుల నమ్మకమన్నారు.

ఇలాంటి గౌరవాన్ని తనకు కల్పించిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. నిత్యం ప్రార్థించే వారికి, మనల్ని కాపాడడానికి ఒక సూపర్‌ శక్తి ఉంటుందని నమ్మేవారికి, పూజ మరింత మంచిని కలగజేస్తుందని తాను నమ్ముతున్నాను అని కుష్బూ పేర్కొన్నారు. ఆమె పూజలో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా నటి కుష్బూ తాజాగా తన భర్త సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిస్తున్న అరణ్మణై 4 చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement