వాళ్లతో పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను : ఖుష్బూ | Actress Kushboo About Aadavallu Meeku Joharlu | Sakshi
Sakshi News home page

Kushboo: 'గ్లిజరిన్‌తో పని ఉంటుంది అనుకుంటారు.. కానీ ఇందులో అలా ఉండదు'

Published Fri, Feb 25 2022 4:04 PM | Last Updated on Fri, Feb 25 2022 4:19 PM

Actress Kushboo About Aadavallu Meeku Joharlu - Sakshi

ఇండస్ట్రీలో ఇకప్పటి స్టార్‌ హీరోయిన్స్‌ ఇప్పుడు కూడా చక్రం తిప్పుతున్నారు. కీలకమైన పాత్రల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్బూ. ఆమె కీలక పాత్రలో నటించిన  'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆడవాళ్లు అంటే ఎక్కువ‌గా గ్లిజ‌రిన్‌తోనే పని ఉంటుంది అనుకుంటారు.

​కానీ ఈ సినిమాతో ఆ భావన తప్పు అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆడవాళ్లు నవ్వుతూ, నవ్విస్తూ సందడి చేస్తారు. అలాగే నా పాత్ర ఎలా ఉందన్నది సినిమా చూశాక ఆడియెన్స్‌ చెప్పాలి. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్‌ చేశాను. ఇక స్క్రిప్ట్ నచ్చితే కొత్త దర్శకులతో పనిచేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement