కుష్బుపై హిజ్రాల ఆగ్రహం... | Transgenders protest against Kushboo outside congress party office | Sakshi
Sakshi News home page

కుష్బుపై హిజ్రాల ఆగ్రహం...

Published Tue, Apr 5 2016 9:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

కుష్బుపై హిజ్రాల ఆగ్రహం...

కుష్బుపై హిజ్రాల ఆగ్రహం...

చెన్నై : ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కుష్బుపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై హిజ్రాలు పున:పరిశీలన చేసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలను హిజ్రాలు ఖండిస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జాతీయ సమాచార ప్రతినిధి అయిన కుష్బు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె రాబోయే ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టుముట్టి సోమవారం నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బు గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన మహిళల శీలాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు హిజ్రాల విషయంలోనూ అదేవిధంగా మాట్లాడటం ఆవేదన కలిగించిందన్నారు. కుష్బు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement