
చెన్నై : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020కి కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ మద్దతు తెలిపారు. అయితే తన అభిప్రాయం పార్టీ వైఖరికి భిన్నమైదని కూడా స్పష్టం చేశారు. ఒక సిటిజన్‌గా మాత్రమే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలిపారు. ‘నూతన విద్యా విధానం-2020పై నా వైఖరి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. ఇందుకు రాహుల్ గాంధీకి నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిదానికి తలాడించే రోబోలా కాకుండా.. నిజం మాట్లాడాను. ప్రతీది మన నాయకుడి అంగీకారం గురించి కాకూడదు.. పౌరుడిగా మన అభిప్రామాన్ని ధైర్యంగా చెప్పగలగాలి’ అని ఖుష్భూ పేర్కొన్నారు. (ప్రముఖ క్రీడాకారులు.. డిప్యూటీ డైరెక్టర్లుగా నియామకం)
అయితే ఆమె ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్ సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ట్వీట్‌తో తను పెద్ద దుమారాన్నే చూశానని ఖుష్భూ అన్నారు. అంతకు ముందు కూడా సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె మద్దతు తెలిపారు. నూతన విద్యా విధానం-2020 అనేది స్వాగతించదగినదని పేర్కొన్నారు. (రియాపై జేడీయూ నేత సంచలన ఆరోపణలు)
Comments
Please login to add a commentAdd a comment