నటి ఇంటి సమీపంలో కంటైనర్‌ కలకలం | Kushboo Tweets Over A Container In Front Of Her House | Sakshi
Sakshi News home page

కుష్బూ ఇంటి సమీపంలో కంటైనర్‌ కలకలం

Published Mon, Jun 24 2019 7:07 AM | Last Updated on Mon, Jun 24 2019 7:07 AM

Kushboo Tweets Over A Container In Front Of Her House - Sakshi

టీ.నగర్‌ : చెన్నై శాంతోమ్‌లోని నటి కుష్బూ ఇంటి ముందు ఒక కంటైనర్‌ లారీ గత పది రోజులుగా నిలిపి ఉంది. దీనికి నెంబర్‌ ప్లేట్‌ కూడా లేదు. ఈ లారీని నటి కుష్బూ ఫొటో తీసి తన ట్విట్టర్‌ పేజీలో విడుదల చేశారు. తన ఇంటికి వెళ్లే వీధి ముందు నెంబర్‌ ప్లేట్‌ లేని కంటైనర్‌ లారీ గత 10 రోజులుగా నిలిచివుందని, అయితే ప్రజలెవరూ దీన్ని పట్టించుకోవడం లేదని, దీనిపై ఫిర్యాదు చేసే ఆలోచనే ఎవరికీ రావడం లేదని పేర్కొన్నారు. నెంబర్‌ ప్లేట్‌ లేనందున అనుమానించాల్సి వస్తోందని, చెన్నై పోలీసులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఇందుకు ట్విట్టర్‌లో బదులిచ్చిన కొందరు మీరెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని ప్రశ్నించారు.

మరికొందరు హేళనగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కుష్బూ ప్రతిస్పందిస్తూ సదరు లారీ తన వీధిలో లేదని, అలా ఉన్నట్లయితే తాను ఫిర్యాదు చేసేదాన్నని తెలిపారు. అలా కాకుండా హేళనగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దీనికి సంబంధించి వరుసగా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల దృష్టికి ఈ వ్యవహారం రావడంతో వారు కంటైనర్‌ ఉన్న వీధి వివరాలను కోరారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు కుష్బూ అందచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement