
పెరంబూరు: ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాం గంలో ఏమైనా జరగవచ్చునని నటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్భూ పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పలుప్రాంతాల్లో ఈవీఎంల మొరాయిం పు సమస్య తలెత్తుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కేరళలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కన్నూరు ప్రాతంలో ఈవీఎం యంత్రం లో నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలు భయపడి పారిపోయారు. పాము బయటకు పోయిన తరువాత ఓటింగ్ యాథావిధిగా జరిగింది. దీనిపై కాంగ్రెస్ మాజీ మంత్రి శశిధరుర్ స్పందిస్తూ ఇలా జరగడం ఇదే ప్రప్రథమం అని పేర్కొన్నారు.నటి కుష్బూ తన ట్విట్టర్‌లో పేర్కొం టూ.. నరేంద్రమోదీ రాజ్యాంగంలో ఏమైనా జరగవచ్చన్నారు. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు కొందరు స్వాగతించినా, మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈవీఎంలను మోదీ తీసుకోచ్చారా, పామును ఆయన ఈవీఎంలలో పెట్టారా? అని రీట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజన్లకు బదులిచ్చే విధంగా నటి కుష్బూ తను డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment