జూనియర్కి వీరాభిమానిని : కుష్బూ | Veteran Actress kushboo A Die-Hard Fan Of Junior NTR | Sakshi
Sakshi News home page

జూనియర్కి వీరాభిమానిని : కుష్బూ

Jan 6 2016 11:15 AM | Updated on Sep 3 2017 3:12 PM

జూనియర్కి వీరాభిమానిని : కుష్బూ

జూనియర్కి వీరాభిమానిని : కుష్బూ

సాధారణంగా యంగ్ జనరేషన్ హీరోయిన్లు, సీనియర్ హీరోలకు అభిమానులుగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అయ్యింది. టాలీవుడ్ యంగ్ జనరేషన్లో టాప్...

సాధారణంగా యంగ్ జనరేషన్ హీరోయిన్లు, సీనియర్ హీరోలకు అభిమానులుగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అయ్యింది. టాలీవుడ్ యంగ్ జనరేషన్లో టాప్ హీరోగా ఉన్న జూనియర్కు, ఓ సీనియర్ హీరోయిన్ 'వీరాభిమానిని', అని తానే స్వయంగా చెప్పటంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.

కొద్ది రోజులుగా వివిధ సందర్భాల్లో నాన్నకు ప్రేమతో సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు సీనియర్ నటి కుష్బూ. అయితే అభిమానులు ఈ సినిమా మీద ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీంతో తన అభిమానులకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది కుష్బూ. 'ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి నన్ను అడిగే వారికి చెపుతున్నాను. నేను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానిని, ఏవో కొన్ని తప్ప అతని సినిమాలన్నీ చూస్తాను'. అంటూ ట్వీట్ చేశారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్, కుష్బూలు కలిసి నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement