![Samantha Strong Reply to Konda Surekha](/styles/webp/s3/article_images/2024/10/2/samantha1234.jpg.webp?itok=sWkNoPNx)
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించింది. 'మహిళల్ని వస్తువుగా చూసే ఈ గ్లామర్ ప్రపంచంలో పని చేసేందుకు, నిలబడి పోరాడేందుకు ఎంతో శక్తి, ధైర్యం అవసరం. కొండా సురేఖగారు.. దయచేసి నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు.
అది నా వ్యక్తిగత విషయం
ఒక మంత్రిగా మీ మాటలకు ఎంతో గౌరవం ఉంటుంది. దయచేసి ఇతరుల వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని వేడుకుంటున్నాను. విడాకుల విషయానికి వస్తే అది నా వ్యక్తిగత విషయం. దాని గురించి ఏదేదో ఊహించడం ఆపండి.
అందులో కుట్ర లేదు
మేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదు. నేను రాజకీయాలకు అతీతంగా ఉంటాను. కాబట్టి దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాను' అని సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment