రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్‌ | Megastar Chiranjeevi Reacts On Konda Surekha Comments On Samantha And Naga Chaitanya Divorce, Tweet Inside | Sakshi
Sakshi News home page

Konda Surekha Controversy: మంత్రి మాటలు విని చాలా బాధపడ్డా: మెగాస్టార్‌ చిరంజీవి

Published Thu, Oct 3 2024 9:29 AM | Last Updated on Thu, Oct 3 2024 10:52 AM

Megastar Chiranjeevi Reacts On Konda Surekha Comments On Samantha

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అ‍య్యారు. మహిళా మంత్రిగా ఉండి ఆమె చేసిన కామెంట్స్‌ చూసి చాలా బాధపడ్డానని అన్నారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు.

చిరు తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..'గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డా. సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సభ్యులు టార్గెట్‌గా మారడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం సరైంది కాదు.  తమ రాజకీయ మనుగడ కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదు. రాజకీయాల కోసం ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు.' అంటూ పోస్ట్ చేశారు. 

(ఇది చదవండి: మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్)

సమాజాన్ని మంచిగా మార్చడానికి మేము నాయకులను ఎన్నుకుంటామని మెగాస్టార్‌ ట్వీట్‌లో ప్రస్తావించారు. మీ ప్రసంగాల ద్వారా దానిని కలుషితం చేయకూడదని హితవు పలికారు. రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు  ఉదాహరణగా ఉండాలని సూచించారు. ఇలాంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి పోస్ట్ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement