
మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ పండుగను పురష్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు. ( నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం )
బతుకమ్మ 💐🌼సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. 🌷🌻🌹బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.🌺🌻🌹 pic.twitter.com/qM8tHhrpfd
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2020