సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మొట్టికాయలు వేసింది.
కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసుపై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు సిటీ సివిల్ కోర్టు మొట్టికాయలు వేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని హితవు పలికింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment