కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ | Rakul Preet Singh Comments On Konda Surekha | Sakshi
Sakshi News home page

నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఇకనైనా ఆపితే మంచిది: రకుల్‌

Published Thu, Oct 3 2024 6:31 PM | Last Updated on Thu, Oct 3 2024 6:53 PM

Rakul Preet Singh Comments On Konda Surekha

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన  వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కోక్కరుగా రియాక్ట్‌ అవుతున్నారు. అయితే, తాజాగా నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించారు. నటి సమంత, నాగార్జున కుటుంబంతో పాటు రకుల్‌ పేరును కూడా కొండ సురేఖ తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. సాటి మహిళ అని కూడా చూడకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చేయడం చాలా బాధాకరమని రకుల్‌ పేర్కొంది.

'తెలుగు చలనచిత్ర పరిశ్రమకు  ప్రపంచవ్యాప్తంగా ఎంతో  ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు ఉంది. ఎంతో అందమైన ఈ చిత్రపరిశ్రమలో నేను గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. సాటి సోదరిగా చూడాల్సిన వారే ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చెందడం బాధాకరం. ఇక్కడ మమ్మల్ని మరింత బాధపెట్టే విషయం ఏమిటంటే.. సమాజంలో ఎంతో బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. మా గౌరవం కోసం మేము మౌనంగా ఉండాలని కోరుకుంటాం. అది మా బలహీనత మాత్రమే, కానీ, దానిని తప్పుగా అనుకుంటే పొరపాటు. 

నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు. నా పేరును తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. అలాంటి  రీతిలో నా పేరు ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. మీరు పూర్తిగా రాజకీయ మైలేజీని పొందేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కళాకారులు, సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచండి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టడం ఇక నుంచి అయినా మానేయండి. అని రకుల్‌ పేర్కొన్నారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ  చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినీనటి సమంత విడాకులు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పెళ్లి,  అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement