
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.
మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని వాయిదా వేస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment